Pancha-Bhrama-Nivrutthi-Sathsang-Speech-in-Telugu

ఓం

ఇప్పుడు మనసు పనిచేయడం అంటే విక్షేపమేనా? అంతేనా? ఎంతసేపు మనసు పనిచేసే విషయం గురించే కదా చెబుతున్నారు.
            మనసు పనిచేయడం అంటే?
            విక్షేపము.
            ఆ విక్షేపము ఎందువల్ల కలుగుతోంది?
            ఆ విక్షేపము ఎందువల్ల కలుగుతోంది?
అజ్ఞానం వల్ల కలుగుతోందా? అవిద్యవల్ల కలుగుతోందా?
            అసలు ఈ రెండు (అజ్ఞానం, అవిద్య) వున్నాయా?
            అజ్ఞానం, అవిద్య ఉన్నాయా?
            (అజ్ఞానం, అవిద్య) రెండూ ఒకటేనా? తేడా ఏమైనా వుందా?
భ్రమ, భ్రాంతిమీరందరూ చాలా కాలం నుంచి ఈ పదాలు వింటూనే వున్నారు.
            భ్రమ, భ్రాంతి రెండూ ఒకటేనా వేరు వేరా?
కొంచెం తేడా వుందంటావ్‌.
            ఎందుకంటే ఋభుగీతలో వున్నటువంటి పంచభ్రమను మీరెత్తుకున్నారు. ఇక్కడ భ్రమను నివృత్తి చేయడం ఎట్లానో చెబుతున్నారు. జీవభావం గురించి కదా, ఇప్పుడిదంతా.
ఈ తగాదా అంతా జీవభావం గురించేనా?
            జీవుడికి భ్రమ వుంటుందా? భ్రాంతి వుంటుందా?
            జీవుడికి భ్రమ వుంటుందా? భ్రాంతి వుంటుందా?
అంటే, భ్రమ అంటే ఏమిటో, భ్రాంతి అంటే ఏమిటో నిర్ణయంగా తెలియాలన్నమాట. అది తెలీదు. అర్థమైందా అండీ!
            ఒకటి అజ్ఞానం వల్ల వస్తోంది, ఒకటి అవిద్య వల్ల వస్తోంది. అర్థమైందా అండీ!
ఐదు శ్లోకాలలో నీ జీవభావాన్ని మొత్తాన్ని పోగొట్టే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నారు.
            (ఒక్కొక్క శ్లోకం చదివి చెప్పండి)

జీవేశ్వరౌ భిన్న రూపాంఇతి ప్రాథమికో భ్రమః
దానికి ఉదాహరణ ఏం చెప్పారంటే, మొదటి భ్రమ.
జీవుడు ఈశ్వరుడు వేరు వేరు అనుకోవడం మొట్టమొదటి భ్రమ.
దీనికి జవాబు, బింబ ప్రతిబింబ దర్శనేన భేద భ్రమో నివృత్తః
ప్రశ్న సమాధానం.
(భ్రమ) ఎలా పోతుంది?
జీవుడు ఈశ్వరుడి ప్రతిబింబమే. ఈశ్వరుడు బింబము, జీవుడు ప్రతిబింబము. ఆకాశములో సూర్యుడు వున్నాడు. కుండలో నీళ్ళల్లో ప్రతిబింబము వుంది. సూర్య ప్రతిబింబమే కదా అది.
కుండలో వున్న ప్రతిబింబము ఎవరు?
జీవుడు. అర్థమైందా అండీ!
ఆకాశంలో వున్న సూర్యుడు?
ఈశ్వరుడు. పరమాత్మ.
గోడ మీద వున్న వెలుగు? కుండలో వున్న ప్రతిబింబం ఎక్కడ పడింది మళ్ళా?
గోడ మీద పడింది.
గోడ కూడా వెలుగుతోందిగా అప్పుడు.
ఆ గోడ మీద వున్న వెలుగు?
జగత్తు.
గోడ మీద వున్న వెలుగు ఏమిటి?
జగత్తు.
ఇప్పుడు నీ గొడవంతా ఏమిటి? జగత్తు కనపడుతోంది అనేనా?
అవునండీ!
అంతేనా?
జగత్తు నాకు బాగా కనబడుతోందని,
జగత్తు ఎలా కనబడుతోంది?
కుండలో సూర్యుడు ప్రతిబింబించడం వలన కనబడుతోందా? (లేక)
సూర్యుడు సరాసరి గోడ మీద పడటం వల్ల కనబడుతోందా?
కుండలో ప్రతిబింబంలో కనబడుతోంది.
కుండలో కనబడుతోన్న ప్రతిబింబాన్ని సరిగ్గా బింబ-ప్రతిబింబ విశ్లేషణ గనుక చేసినట్లయితే, ఏమైందప్పుడు?
ఆ పరమాత్మయే సత్యమని, కుండలో వున్న ప్రతిబింబం అసత్యమని, గోడమీద వున్న ప్రతిబింబం అనేది ప్రతిబింబానికి ప్రతిబింబం అని తెలిసింది. అంతే కదా! ఇప్పుడు,

జీవేశ్వరులు భిన్నులా? అభిన్నులా?
జీవేశ్వరులు భిన్నులా? అభిన్నులా?
భిన్నులు అంటే వేరు వేరుగా వున్నారు. అభిన్నులు అంటే ఒక్కటిగానే వున్నారు. బింబ ప్రతిబింబాలు వేరుగా లేవు. నువ్వు అద్దం ముందు నిలబడ్డావండీ, నీ ప్రతిబింబం కనపడుతోంది.
అద్దంలో వున్న ప్రతిబింబం, నువ్వు ఒకటేనా కాదా?
ఒకటే కదా!
వేరే వాళ్ళు వచ్చారా? అక్కడ ఏమన్నా?
రాలేదు కదా! (అలా చూడాలి).
అలా చూస్తే, మొదటి భ్రమ పోతుంది.
ఏమిటి మొదటి భ్రమ?
జీవుడు, ఈశ్వరుడు వేరే వున్నారు అని ఆలోచించడమే మొదటి భ్రమ. నీ మనసు ఏదైనా సరే, ఒక ఆలోచన చేసేటప్పుడు, ఆ ఆలోచనకు ముందు దీనిని పెట్టాలి.
ఈ ఆలోచన వెనకాల నేను
జీవుడు, ఈశ్వరుడు వేరుగా వున్నారని ఆలోచిస్తున్నానా?
            జీవుడు, ఈశ్వరుడు ఒకటిగానే వున్నారని అలోచిస్తున్నానా?
(జీవ, ఈశ్వరులు) ఒకటిగానే వున్నారనే పద్ధతిలో మాట్లాడితే నేమో జ్ఞానం, వేరుగా వున్నారని చూస్తే అజ్ఞానం.

రెండవ భ్రమ:
            ఆత్మనిష్ఠం కర్తృగుణం వాస్తవం వా ద్వితీయకం I
            స్ఫటిక లోహిత దర్శనేన పారమార్థిక కర్తృత్వ భ్రమో నివృత్తః II
రెండవ ప్రశ్న ఏమిటి?
            అన్నీ కర్తవ్యాలు నాకే వున్నాయి. అంతేనా కాదా? ఇవన్నీ నేనే కదా చెయ్యాల్సింది, పుట్టాను, పెరిగాను, జీవించాలి, బాల్య, కౌమార, యౌవ్వన, వృద్ధాప్యములు, అనేక రకరకాల సమస్యలు, కుటుంబభారాలు, బాధ్యతలు అన్నీ నాకేనా? నీకా? ఎదుటి వాళ్ళు ఎవరైనా ఎత్తుకోమంటే ఎత్తుకుంటారా? ఈ బాధ్యతని? ఎత్తుకోరా? ఎవరిది వాళ్ళు చేయవలసిందేనా? ఇదంతా నా కర్తవ్యమేనా? ఇదంతా నా కర్తవ్యమే అనుకోవడం రెండవ భ్రమ.
ఇదంతా నా కర్తవ్యమే అనుకోవడం రెండవభ్రమ. ఎలాగయ్యా?
మొదటిది ఏం చెప్పారు?
జీవుడు ఈశ్వరుడు వేరే వున్నారని మనం ఇందాకడి నుంచి పూజలు గొడవ గట్రా అంతా చెప్పుకున్నాం కదా! జీవుడు ఈశ్వరుడు వేరుగా వున్నారన్నంత వరకూ అలా చేస్తావు, కర్మ కాండ పరిధిలో చేస్తావు. జీవుడు – ఈశ్వరుడు ఒకటే అనే దశలో వుండి, ఆలోచన చేయడం ప్రారంభించు. ఇప్పుడు,

రెండవది ఏం చెబుతున్నారు?
సరే నండీ! ఈ ప్రపంచం అంతా నాకు కనబడుతోంది, నా కుటుంబం కూడా నాకు కనబడుతోంది. నా శరీరం కనబడుతోంది. నా కర్తవ్యాలు కనబడుతున్నాయి. నా బాధ్యతలు కనబడుతన్నాయి. అవన్నీ చెబుతున్నావు కదా! ఇదంతా భ్రమే.

రెండవ భ్రమ ఏమిటయ్యా?
            ఇదంతా నా కర్తవ్యమే అనటం నీ రెండవ భ్రమ.
ఎలాగా?
            దానికి సమాధానం చెబుతున్నారు.
స్పటికం, ఒక స్పటికానికి ఏమైనా కానీ రంగు వుందా?
గాజు పట్టకం – దానికేమన్నా రంగు వుందా?
అద్దానికి రంగు వుందా?
లేదు. కానీ, అది రంగుతో కనబడుతోందా లేదా?
ఎలా కనబడుతోంది?
ఒక రంగువున్న వస్తువుని దాని ప్రక్కన పెట్టటం చేత.
ఒక ఎర్ర రంగు వున్నటు వంటి వస్తువుని, గాజు పట్టకం ప్రక్కన పెట్టారనుకోండి, గాజు పట్టకం ఎలా కనబడింది?
ఎర్రగా కనబడింది. అంతేనా కాదా?
            Original గా దానికేమన్నా రంగు వుందా?
లేదు.
కాబట్టి, వస్తుతః నీవు ఈశ్వరుడవే అయినప్పుడు నీకు ఏ కర్తవ్యము లేదు. నీవు జీవుడవని తలవగానే నీకు అన్ని కర్తవ్యాలు వచ్చేసినాయి.

ఇప్పుడు, మొదటి భ్రమను ఆశ్రయించి రెండవ భ్రమ వున్నదా? రెండవ భ్రమను ఆశ్రయించి మొదటి భ్రమ వుందా?
            జీవుడు - ఈశ్వరుడు వేరుగా వున్నారు అనంగానే, జీవుడికి సంబంధించినవన్నీ నీకు చుట్టుముట్టినాయి కర్తవ్యాలన్నీ.

జీవుడు – ఈశ్వరుడు వేరుగా లేరుఅనంగానే ఏమైపోయింది?
            నాకు ఏ కర్తవ్యమూ లేదు.
ఇది కేవలం ఎలా వచ్చింది?
            గాజు పట్టకం పక్కన, ఎర్ర రంగు కాంతి కల్గిన దాన్ని పక్కన పెట్టడం వల్ల, ఈ ఎరుపు రంగు స్పటికానికి వచ్చింది తప్ప వస్తుతః స్పటికానికి ఏ కర్తవ్యమూ లేదు. అని నిర్ణయమైంది. అది రెండవ భ్రమ.

స్ఫటిక లోహిత దర్శనేన పారమార్థిక కర్తృత్వ భ్రమో నివృత్తః II
ఆఁ... అదిట సంగతి.
నీకు ఈ కర్తవ్యం ఎలా వచ్చిందట? నీవు ఏ కర్తవు అసలు?
            మన దగ్గర మూడు ప్రయోజనాలున్నాయి. ఏదైనా పని చేసేటప్పుడు, మూడు ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఇవన్నీ పనులే కదా! ఇందాకడ చెప్పినవన్నీ బాధ్యతలే కదా! ఈ పనులన్నింటినీ కూడాను మూడు ప్రయోజనాలతో చేస్తాం. 1. వ్యక్తిగత ప్రయోజనం, 2. సామాజిక ప్రయోజనం, 3. పారమార్థిక ప్రయోజనం. అర్థమైందా అండీ!

కానీ, మనం సాధ్యమైనంత వరకూ అన్ని పనుల్ని ఏ ప్రయోజనంతో చేస్తాం?
            వ్యక్తిగత ప్రయోజనం కోసం చేస్తాం.
అది, I am king అనిపించుకోవడానికి చేస్తాం అన్నమాట! నన్ను బాగా ప్రపంచం అంతా గుర్తించాలి. నన్ను నా కుటుంబం గుర్తించాలి. కనీసం నన్ను నేనైనా గుర్తుంచుకోవాలి. వారెవరూ గుర్తించకపోతే. ఇది వ్యక్తిగత ప్రయోజనం.

సామాజిక ప్రయోజనం అంటే ఏమిటి?
            నీవు హారం వేసుకోగానే పక్కవాళ్ళు చూసి బాగుంది అనటం, నీవు ఏదన్నా ఒకపని చేస్తే పక్కవాడు చూసి బాగుంది అనడం, ఎవరో ఒకరు, నువ్వు కాకుండా వేరే ఎవరైనా. అంతేనా కాదా?
నువ్వు సేవ చేశావండీ. ఒక అనాథాశ్రమానికి వెళ్ళావు. వెళ్ళి ఏదో సహాయం చేశావు.
చేయగానే వాళ్ళేమన్నారు?
దేవుడిలాగా వచ్చి కాపాడాడండీ, ఈయన సహాయం చేస్తున్నారండీ అన్నారు.
ఇప్పుడు,
నిన్ను చూశారా? నీలో వున్న దేవుడిని చూశారా?
నిన్ను చూశారా? వాళ్ళు, నీలో వున్న దేవుణ్ణి చూశారా?
నిన్ను చూశారని నువ్వు అనుకున్నావు కాబట్టి అది లోన అహంకారం అయ్యింది.
నీలో వున్న దేవుణ్ణి చూశారు అనుకుంటే ఏమైంది?
అక్కడేమీ సమస్య రాలేదు. అంతేనా? కాదా!
నేను అనాథలకు సహాయం చేశాను అని అనుకోవచ్చా? (లేక)
ఈశ్వరుడు నాకు ఈ అవకాశం కల్పించాడని అనుకోవచ్చా?
            ఈశ్వరుడు నాకు ఈ అవకాశం కల్పించాడని అనుకోవచ్చు.
కానీ, మనమేమి అనుకున్నాం?
            మన ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాం దేహీ అనంగానే
ఇప్పుడు చెయ్యి ఖాళీగా లేదు పో! అందంట ఈవెడ.
ఇప్పుడేమైంది? వచ్చిన వాడు ఎవడు?
            ఈశ్వరుడు.
ఇప్పుడు నేను అర్జెంటుగా ఇక్కడ లలితాసహస్రనామం చదువుతుంటే, మధ్యలో వచ్చి అన్నం పెట్టమంటావా? సహస్రనామం ఆపి. పో! అవతలకి. అందంట ఈవెడ. అర్థమైందా అండీ! మనమంతా కూడా (పొద్దున చెప్పా) ఏనుగు బొమ్మలను నమ్ముతాం కానీ, ఏనుగును నమ్మమన్నమాట. అర్థమైందా అండీ? ఏనుగు బొమ్మలను నమ్ముతాం కానీ, ఏనుగును నమ్మం. కాబట్టి,

ఎదురుగుండా కనపడుతున్నటువంటి జీవులలోని ఈశ్వరుడను తెలుసుకున్నట్లయితే, అప్పుడేమయ్యింది?

మనం చేసే అన్ని పనులనీ కూడా, అన్ని కర్తవ్యాలనీ కూడా, ఏ ప్రయోజనంలో చేస్తావు? ఇప్పుడు?
పారమార్థిక ప్రయోజనంతో చేస్తావు. అదే సరైన విధానం.

కానీ, ఈ పారమార్థిక ప్రయోజన కర్తృత్వం ఎందువల్ల ఏర్పడింది నీకు?
జీవుడు ఈశ్వరుడు భిన్నము అనుకోవడం వలన ఏర్పడింది. జీవేశ్వరులు అభిన్నులు అనంగానే ఈ పారమార్థిక ప్రయోజనం కూడా, లేకుండా పోయింది. అంటే కర్త వున్నంత వరకూ కర్తవ్యం వుంటుంది. కర్త లేకుండా గనుక చేసేటి వంటి జీవితాన్ని గనుక నీవు జీవించినట్లయితే, ఏ కర్తవ్యము లేదు అని చెప్పడం దాని వుద్దేశ్యము. అర్థమైందా అండీ!
ఇప్పుడు మరి ఏదైనా చేసేటప్పుడు వ్యక్తిగత ప్రయోజనాన్ని కానీ, సామజిక ప్రయోజనాన్ని కానీ, పారమార్థిక ప్రయోజనాన్ని కానీ, ఈ మూడు ప్రయోజనాలు ఎప్పుడైతే ఆశిస్తావో, అప్పుడది కామ్యక కర్మ అవుతుంది. నిష్కామ కర్మ అవ్వదన్నమాట.

నిష్కామ కర్మ అంటే అర్థం ఏమిటంటే?
కర్త లేకుండా చేయడమే నిష్కామకర్మ అంటే. కేవలం కర్మఫలాన్ని ఈశ్వరార్పణ భావంతో చేసినంత మాత్రాన అది లేకుండా పోదు. నేను చేసేవాడను అన్నంతవరకూ అది నిన్నే ఆశ్రయిస్తుంది. కాబట్టి నేను చేయడం లేదు. అందరియందు వున్న ఈశ్వరుడే నా చేత ఇలా చేసేట్టుగా ప్రేరేపించాడు. అందరి యందున్న ఈశ్వరుడే దానిని అనుభవిస్తున్నాడు. కాబట్టి చేయక ముందున్నదీ ఈశ్వరుడే, చేసిన తరువాత మిగిలింది కూడా ఈశ్వరుడే. ఆ వున్నది ఎప్పుడూ ఈశ్వరుడే. నేను లేని వాడను. అని జీవభావాన్ని ఎగరగొట్టే ప్రయత్నం చేయాలన్నమాట.

ఎందుకని, ఈ జీవుడనే కర్త ఎట్లా వచ్చాడంట ఇప్పుడు?
స్పటికం లాగా వుండే ఈశ్వరుడి పక్కన, ఎర్రరంగు పేపర్‌ పెడితే ఇది ఎర్రగా ఎలా కనపడుతుందో, అలా కనపడుతున్నవాడీ జీవుడు. వస్తుతః స్పటికంగా వున్న ఈశ్వరుడికి ఏ రంగూ లేదు.

శరీరత్రయ సంయక్తో జీవస్సంగీ తృతీయకః I
కాబట్టి, మూడవ భ్రమ వచ్చిందండీ, ఇప్పుడు మనకి. ఏమిటట?
శరీర త్రయం, మూడు శరీరాలున్నాయట.
మనకిప్పుడు ఒక శరీరం వుందా? మూడు శరీరాలున్నాయా?
మూడున్నాయా?
ఒకటే కనబడుతుందిగా?
లోపల వున్నాయా?
కళ్ళెదురుగుండా కనపడుతున్నది స్థూలం. కనపడకుండా వుంటే సూక్ష్మం. ఆ సూక్ష్మం ఏర్పడటానికి కారణం వుంటే కారణం. వుంటే అది. కారణం లేకపోతే మహాకారణం. అది. ఏదో ఒక కారణం. అర్థమైందా అండీ? కాబట్టి, ఈ మూడు శరీరాలు స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు.
అంటే ఏమిటి? శరీరం ప్రాణం మనస్సు దాని అవతల వున్న జ్ఞాత. అంతవరకూ చెప్పుకునేట్లయితే పంచీకరణ దృష్ట్యా చెప్తే, అది విషయం. అర్థమైందా అండీ?
మీ అందరికీ పంచీకరణ బాగా వచ్చు కాబట్టి, మళ్ళా చెప్పనక్కర్లేదు.
ఈ మూడు శరీరాలతో సంగీ - అంటే   కలిసి వున్నటువంటి వాడు. మీరు ఎప్పుడైనా గానీ, ఏదైనాగానీ ఆలోచన చేసినా, చూసినా, ఏ చేత అయినా సరే ప్రతిచోట, ఇప్పుడిది,
నేనే స్థూలశరీరమే నేననుకుని చేస్తున్నానా?
సూక్ష్మశరీరమే నేననుకుని చేస్తున్నానా?
కారణ శరీరం నేననుకుని చేస్తున్నానా?
కారణ శరీరం అంటే ఏమిటి? అసలు.
కారణ శరీరం అంటే ఏమిటి?
            ఆనంద భావమే కారణ శరీరం. వేరే ఏమీ లేదు. గాఢనిద్రావస్థలో నువ్వు పొందుతున్నటువంటి, ఆనందం ఏదైతే వున్నదో, ఆ ఆనందమయ కోశంలో అనుభవిస్తున్నటువంటి, ఏ ఆనందభావం వున్నదో, ఆ ప్రియం మోద ప్రమోదములు అక్కడ సూక్ష్మంగా అనుభవించబడుతున్నాయి. శరీర ప్రాణ మనస్సులు లేకుండా. వీటి ఉనికి నీకు తెలియబడకుండా, తమంతట తామే అనుభవించబడుతున్నాయి. ఆనందమయకోశంలో వున్న భావం పేరు ఆనంద భావం. ఆ ఆనంద అపేక్షయే కారణశరీరం. అర్థమైందా అండీ! ఈ ఆనంద అపేక్ష అనే కారణశరీరం వల్లనే, మనసులో రజోగుణం నిద్రలేచి, అది కలగా మార్పుచెంది, అది మళ్ళా ఇంకా తమోగుణంగా రూపొంది, అది శరీరం దాకా దిగివచ్చి, ఆ మూడు గుణాలతోటి శరీరంతో వ్యవహరిస్తోంది. ఇది మూడు శరీరాలంటే, మూడు అవస్థలు అంటే. మూడు గుణాలు అంటే.
కాబట్టి ఈ మూడు మూడుగా వున్నదానిని బాగా అధ్యయనం చేసి, వాటిల్లో ఏం పోగొట్టుకోవాలట?
సంగీ – సంగత్వ దోషం. అది నేనే. అర్థమైందా అండీ!
అమ్మమ్మ! అని మీ మనుమరాలు వచ్చి మిమ్మల్ని పిలిచింది అనుకోండి, అప్పుడు మీరేమి feel అయ్యారు?
పిలవగానే ఏమయ్యారు? అదయ్యారా? లేదా?
అప్పుడేమయ్యావ్‌?
ఆ పాత్ర నువ్వు అయ్యావన్నమాట. వేరే ఏమీ లేదు. అవునా కాదా?
ఆ పాత్ర నువ్వు అవుతావా? ఎప్పుడైనా?
కావు. ఈ మూడు శరీరాలు గానీ, మూడు గుణాలు గానీ, మూడు అవస్థలు గానీ ఇవన్నీ కూడా  నీ పాత్రలన్నమాట. నీవు వీటికి విలక్షణంగా వున్నటువంటి వాడివి అని తెలుసుకోవాలి.
కాబట్టి మూడవ భ్రమ ఏమిటి?
            మూడు శరీరాలున్నాయని, మూడు గుణాలున్నాయని, మూడు అవస్థలున్నాయని ఆ మూడు మూడుగా వున్నదంతా నేనే. ఈ జీవుడికి ఆ ***
ఇందాక చెప్పిన ఆ జీవుడు ఎవరు?
            స్పటికం పక్క ఎర్రరంగు కాగితం పెడితే... ఎలా అయితే జీవభావం కలిగిందో,
ఈ జీవభావం వల్ల నీకు ఇప్పుడు ఏం వచ్చిందట?
            ఈ మూడు మూడుగా వున్న అన్నింటితో సంగత్వదోషం వచ్చింది.
ఎలా పోతుంది మరి?
           
ఘటమఠాకాశ దర్శనేన సంగీతి భ్రమోనివృత్తః
అదిట. ఘటమఠాకాశము.
ఘటము అంటే ఏమిటి?
కుండ. అంతేనా?
ఘటం అంటే ఏమిటి?
కుండ.
మఠం అంటే?
ఇల్లు. అంతేగా.. ఏదో ఒక ఆశ్రయం. ఆశ్రమం అంతేనా కాదా?
దాని అవతల వున్నది ఏంటీ?
దీని పైన ఏముందండీ? ఇంటిపైన?
ఆకాశం వుంది. అంతేనా కాదా?
ఘటం (కుండ) లోపల ఆకాశం వుందా లేదా?
వుంది.
ఇంటిలోపల ఆకాశం వుందా? లేదా?
వుంది.
ఈ రెండింటికి బయిట ఆకాశం వుందా లేదా?
వుంది.
ఇప్పుడు ఆకాశ లక్షణం దృష్ట్యా చూస్తే,
ఆకాశంలో ఘటం మఠం వున్నాయా? ఘటం మఠంలో ఆకాశం వుందా?
 (33.47)
(To be cont …)